ఐపిఎల్‌ భారత్‌లోనే

ఐపిఎల్‌ భారత్‌లోనే

 న్యూఢిల్లీ : భారత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) 12వ ఎడిషన్‌ మార్చిలోజరగనుంది. తొలుత ఎన్నికల నేపథ్యంలో వేదికలు మార్చే విషయం పరిశీలించిన బిసిసిఐ టోర్నీని ఒక నెల ముందుకు జరిపి ఇక్కడే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ(సిఓఏ) మంగళవారం ధ్రువీకరించింది. ఎప్పటిలా ఏప్రిల్‌ మొదటి వారంలో కాకుండా మార్చి 23న ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని కమిటీ వెల్లడించింది. 

త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో భద్రత కల్పించడం కష్టమ వుతుందని పొట్టి క్రికెట్‌ లీగ్‌ను విదేశాలకు తరలిస్తారని ఊహా గానాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'ఇప్పటికైతే ప్రాథ మిక వేదికలు అందరికీ తెలి సినవే. మ్యాచ్‌లు తర లించాల్సిన అవ సరం వస్తే బ్యాకప్‌ వేది కలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలను సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల ప్రక్రియ తేదీలు ప్రకటించిన తర్వాత సభలు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాకప్‌ వేదికలు ఎంచుకున్నాం' అని వినోద్‌ రారు, డయానా ఎడుల్జీ నేతృత్వంలోని పాలకుల కమిటీ వెల్లడించింది. ఇంతకు ముందు 2010లో ఐపీఎల్‌ను మార్చిలో ఆరంభించారు. 

సాధారణంగా అయితే ఏప్రిల్‌లో మొదలై మే చివరి వారంలో ముగుస్తుంది. ఈసారి మే 30న ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ సైతం ఆరంభం అవుతోంది. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం రెండు టోర్నీల మధ్య ఆటగాళ్లకు కనీసం 15 రోజుల విశ్రాంతి ఇవ్వాలి. అందుకే ముందుగా ఐపిఎల్‌ను ఆరంభిస్తున్నారు. రాష్ట్ర సంఘాలు, అధికారులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఐపిఎల్‌ 2019 షెడ్యూలు విడుదల చేస్తామని బిసిసిఐ తెలిపింది. ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్‌ నిర్వహించారు. 2014లో కొన్ని మ్యాచ్‌లను దుబారుకు తరలించిన సంగతి తెలిసిందే.