మయన్మార్‌పై మ‌లేషియా విజ‌యం

మయన్మార్‌పై మ‌లేషియా విజ‌యం

  కౌలలంపూర్: టి20 క్రికెట్ చరిత్రలో మలేషియా జట్టు సరికొత్త రికార్డు సెట్ చేసింది. మలేషియా వేదికగా జరుగుతున్న ఐసిసి వరల్డ్ టి20 క్వాలిఫయర్స్‌ టోర్నీలో కేవలం 10 బంతుల వ్యవధిలోనే లక్ష్యాన్ని ఛేదించి మలేషియా జట్టు అరుదైన రికార్డుని నెలకొల్పింది. మయన్మార్ ఇచ్చిన‌ లక్ష్యాన్ని మలేషియా జట్టు 1.4 ఓవర్లోనే 11/2తో గెలిచింది. దీంతో క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన ఛేదనగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన మయన్మార్‌ జట్టు, స్పిన్నర్ పవన్‌దీప్ సింగ్ 5/1తో చెలరేగడంతో 10 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పవన్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. 

దీంతో  మయన్మార్ జట్టు 10.1 ఓవర్లు ముగిసే సమయానికి 9/8తో నిలిచింది. ఇదే సమయంలో చాలాసేపు  వర్షంతో పడడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గిన అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మలేషియా లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఆరు పరుగులుగా నిర్ణయించారు. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన మలేషియా జట్టుకు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  ఓపెనర్లు ఇద్దరూ మొదటి ఓవర్‌లోనే డకౌటవ్వడంతో ఆ జట్టు కొంత ఆందోళనకు గురైన.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సుహాన్ చక్కటి సిక్స్ తో మలేషియా జట్టు గెలిపించాడు.