నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే

నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే

   నాటింగ్‌హామ్‌ : టీ20 సిరీస్‌ను గెలిచి జోరుమీదున్న టీమిండియాతో ఇంగ్లండ్‌ జట్టు వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం జరగనుంది. కోహ్లీ సేన అటు బ్యాటింగ్‌లోనూ... ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉండడంతో ఇంగ్లండ్‌ గడ్డపై అద్భుతంగా రాణిస్తోంది. వచ్చే ఏడాది ఇక్కడే ఐసిసి ప్రపంచకప్‌ జరగనున్న దృష్ట్యా వన్డే సిరీస్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టు 126 పాయింట్ల తో అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ 123 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0తో క్వీన్‌స్వీప్‌ చేస్తే భారత్‌ అగ్రస్థానానికి చేరడం ఖాయం. 

భారతజట్టుకు కలిసొచ్చే అంశమేమిటంటే ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఓపెనర్ల ధావన్‌, రోహిత్‌తోపాటు కెఎల్‌ రాహుల్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో విరాట్‌ కోహ్లి మూడోస్థానంలో కంటే... నాల్గోస్థానంలో బ్యాటింగ్‌కు దిగితే ఉపయుక్తంగా ఉంటుంది. కోహ్లీ తర్వాత వరుసలో రైనా, ధోనీ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మిడిల్‌ ఆర్డర్‌లో రాణించే అవకాశముంది. ఇక బౌలింగ్‌ విభాగాని కొస్తే ఇంగ్లీషు జట్టు బ్యాట్‌మన్లను ఇబ్బందుకు గురిచేస్తున్న కుల్దీప్‌ యాదవ్‌, యజ్ఞేంద్ర చాహల్‌తోపాటు ఉమేష్‌ యాదవ్‌, భువనేశ్వర్‌కుమార్‌లు టీ20లో రాణించారు. 
భారత జట్టు (అంచనా) : కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌, రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, ధోనీ (వికెట్‌ కీపర్‌), రైనా/దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, ఉమేష్‌ యాదవ్‌/ఠాకూర్‌, భువనేశ్వర్‌కుమార్‌.
ఇంగ్లండ్‌ (అంచనా) : మోర్గాన్‌ (కెప్టెన్‌), రారు, బారిస్ట్రో, బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), మొయిన్‌ ఆలీ, జో బాల్‌, రూట్‌, హేల్స్‌, ఫ్లంకెట్‌/మార్క్‌ఉడ్‌, బెన్‌ స్టోక్స్‌, రషీద్‌/డేవిడ్‌ విల్లీ,