న్యూజిలాండ్‌ క్లీన్‌ స్వీప్‌

న్యూజిలాండ్‌ క్లీన్‌ స్వీప్‌

 నెల్సన్‌(ఓవల్‌) : మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండో వన్డేల్లో గెలిచి ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న కివీస్‌ జట్టు మంగళవారం శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ 115 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీస్కోర్‌ చేసింది. రాస్‌ టేలర్‌(137), నికోలస్‌(124) పరుగులతో అదరగొట్టారు. దీంతో రాస్‌ టేలర్‌ న్యూజిలాండ్‌ తరఫున 20 శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా అవతరించాడు. అంతేగాక వరుసగా ఆరు వన్డేల్లో 50కుపైగా పరుగులు చేసి సచిన్‌, కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 249 పరుగులకే పరిమితమైంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు టేలర్‌కు లభించాయి.