న్యూజిలాండ్‌ ఘన విజయం

న్యూజిలాండ్‌ ఘన విజయం

  వెల్లింగ్టన్‌ : వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో సోమవారం న్యూజిలాండ్‌ జట్టు ఇన్నింగ్స్‌ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్‌ వ్యాగనర్‌ 39 పరుగులకు 7 వికెట్లు సాధించాడు. అనంతరం న్యూజి లాండ్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 520 పరుగులకు డిక్లేర్‌ చేసింది. ఆ జట్టులో గ్రాంథోమ్‌ 105, బ్లండెల్‌ 107 అత్యధిక పరుగులు చేశారు. వెస్టిండీస్‌ జట్టు 386 పరుగుల ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవడానికి చివరికంటా పోరాడి 319 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. దీంతో న్యూజిలాండ్‌ జట్టు మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు రెండు టెస్ట్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది.