పాకిస్థాన్ దే చాంపియన్స్ ట్రోఫీ..

పాకిస్థాన్ దే చాంపియన్స్ ట్రోఫీ..

లండన్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాకిస్థాన్ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఫైనల్ లో 30.3 ఓవర్లలోనే ఆలౌటై పిచ్ నుంచి వెనుదిరిగింది. పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. శిఖర్ ధవన్-21, కోహ్లీ-5 , యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోనీ -4, జడేజా-15 పరుగులతోనే సరిపెట్టుకోగా..పాండ్యా 76 పరుగులతో పరువు నిలబెట్టాడు.