‘రాళ్ల దాడి సరైంది కాదు’

‘రాళ్ల దాడి సరైంది కాదు’

 గువాహటి: భారత్‌తో రెండో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ సంఘటనలో బస్సు కిటికీ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సీట్లో క్రికెటర్లెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. క్రికెటర్లందరూ సురక్షితంగా ఉన్నారని అసోం క్రికెట్ అసోసియేసన్ (ఏసీఏ) తెలిపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ రాళ్ల దాడిని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఖండించారు. ఆటను ఆటలాగా చూడాలని హితవు పలికారు. వారిపై దాడి చేయడం మన ఇంటికి వచ్చిన అతిథిని అవమానించినట్లు అవుతుందని తెలిపారు.