రెండో టైటిల్‌ సాధనకు సన్‌రైజర్స్‌ సిద్ధం

రెండో టైటిల్‌ సాధనకు సన్‌రైజర్స్‌ సిద్ధం

  హైదరాబాద్‌ : 2016లో ఓసారి ఐపిఎల్‌ టైటిల్‌ను ముద్దాడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరోసారి తన సత్తాను చాటనుంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ టీమ్‌ మెంటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. సన్‌రైజర్స్‌ ఆరంజ్‌ ఆర్మీ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించే అవకాశముందని.. అంతేగాక ఈసారి తమ జట్టు ఆల్‌రౌండర్లతో కూడి ఉందని తెలిపాడు. భీకరమైన ఆల్‌రౌండర్లలో మనీష్‌పాండే, యూసఫ్‌ పఠాన్‌, షకీబ్‌-ఉల్‌-హసన్‌, బిల్లీ స్టాన్‌లెక్‌, వృద్ధిమాన్‌ సాహా, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వంటి ఆల్‌రౌండర్లతో కూడి ఉందన్నాడు. 

బాల్‌ టాంపరింగ్‌ వ్యవహారంతో సైన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు డేవిడ్‌ వార్నర్‌ దూరమైనప్పటికీ కొత్త కుర్రాళ్లతో జట్టు ఉరకలెత్తే అవకాశముందన్నాడు. అంతేగాక జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌తోపాటు భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌లు కూడా జట్టుకు కొండంత అండగా ఉండనున్నారు. ఈ విలేకరుల సమావేశంలో హెడ్‌ కోచ్‌ టామ్‌ మూడీ, బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ తదితరులు పాల్గొన్నారు.