రొనాల్డో,మెస్సీనే మించాడు! 

రొనాల్డో,మెస్సీనే మించాడు! 

 న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గోల్స్ స్టెక్‌రేట్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీనే మించి ఔరా అనిపించాడు. 0.57 మ్యాచ్ రేషియోతో ఛెత్రి గోల్స్ సాధించగా.. రొనాల్డో 0.525, మెస్సీ 0.49 మ్యాచ్ రేషియోను నమో దు చేశారు. ఇటీవల కిర్గిస్థాన్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో గోల్‌తో ఛెత్రి కెరీర్‌లో 54వ అంతర్జాతీయ గోల్ నమోదు చేశాడు.