సైనా వద్ద శ్రద్ధాకపూర్ ట్రైనింగ్..

సైనా వద్ద శ్రద్ధాకపూర్ ట్రైనింగ్..

 ముంబై ; భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ లో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది శ్రద్ధాకపూర్. సైనా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌, శ్రద్ధాకపూర్ తో కలిసి ట్రైనింగ్ సెషల్ పాల్గొన్న ఫొటోలను సైనా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ‘గోపీ సర్..శ్రద్ధాకపూర్..నేను’ అని క్యాప్షన్ పెట్టి ఫొటోను షేర్ చేసింది సైనా. అమోల్ గుప్తే డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రద్ధాకపూర్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రద్ధాకపూర్ ఇప్పటికే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ బయోపిక్ హసీనాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.