‘సొంత అభిప్రాయాలను గౌరవించాలి’

‘సొంత అభిప్రాయాలను గౌరవించాలి’

 దుబాయ్: తనను టీ20ల నుంచి తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఆటగాడు ధోనీ స్పందించాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నాడు. టీమ్‌ఇండియాలో భాగం కావడమే గొప్ప ప్రేరణ. చిన్నప్పట్నించి ఎన్నో కష్టాలను అనుభవించి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను చూశాం. కేవలం క్రికెట్‌పై తపన, అభిరుచి, ఆసక్తి ఉన్న వాళ్లకే ఇది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు దేశం తరఫున ఆడలేరు. నేనెప్పుడూ ఫలితాన్ని నమ్మను. కేవలం నా చేతుల్లో ఉన్న ప్రక్రియను మాత్రమే నమ్ముతాను అని మహీ పేర్కొన్నాడు.