సొంత ఊరులో భువనేశ్వర్‌ వివాహం

సొంత ఊరులో భువనేశ్వర్‌ వివాహం

  నాగపూర్‌ : భారత పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఈ నెల 23 వివాహం చేసుకోనున్నాడు. అతని సొంత ఊరైన మీరట్‌లోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పెళ్లి జరగనుంది.26న బులంధషర్‌లో స్థానికులు, కుటుంబ సభ్యులకు రిసెప్షన్‌ ఆ తర్వాత తొటి క్రికెటర్లకు ఈ నెల 30న రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నాడు. రెండో టెస్ట్‌ 24 నుంచి 28 వరకు నాగపూర్‌లో జరగనుంది. దీంతో భువి ఈ టెస్ట్‌కు దూరం కానున్నాడు. దీంతో టెస్ట్‌ పూర్తి అయిన తర్వాత టీమిండియా సభ్యులు రిసెప్షన్‌కు హాజరవుతారని భువి తండ్రి కిరణ్‌ పాల్‌ సింగ్‌ తెలిపాడు. ఢిల్లీ వేదికగా డిసెంబర్‌ రెండు నుంచి జరిగే మూడో టెస్ట్‌కు అతను అందుబాటులో వచ్చే వీలుంది.