టీమిండియా బిజీ షెడ్యూల్‌

టీమిండియా బిజీ షెడ్యూల్‌

 న్యూఢిల్లీ : టీమిండియా ఆటగాళ్లు బిజీ షెడ్యూల్‌తో ఊపిరిసలుపుకోలేకపోతున్నారు. గత ఏడాది సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియాజట్టు ఆస్ట్రేలియాకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా పర్యటనను జనవరి 18తో ముగియనుంది. అనంతరం జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌ జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్‌ తలపడనుంది. కివీస్‌ పర్యటన ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. 

అనంతరం ఫిబ్రవరి 24 నుండి స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లకు షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఖరారు చేసింది. మార్చి 13 వరకూ కంగారు జట్టుతో ఐదు వన్డేల్లో టీమిండియా పోటీపడనుంది. ఆ తర్వాత మార్చి 23 నుంచి ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌) 12వ సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు పయనం కావాల్సి ఉంటుంది. దీంతో రాబోయే ఆరు నెలలు టీమిండియా జట్టు ఊపిరి సలుపుకోవడానికి వీలులేకుండా బిజీ షెడ్యూల్‌ను బిసిసిఐ ఖరారు చేసింది.