టెన్నిస్ తార హింగిస్‌కు డబుల్ ఆనందం

టెన్నిస్ తార హింగిస్‌కు డబుల్ ఆనందం

 స్విట్జర్లాండ్ టెన్నిస్ తార మార్టినా హింగిస్ యూఎస్ ఓపెన్‌లో డబుల్ సాధించింది. బ్రిటన్‌కు చెందిన జేమీ ముర్రేతో కలిసి మిక్స్‌డ్ చాంపియన్‌గా నిలిచిన హింగిస్.. మహిళల డబుల్స్‌లోనూ విజయభేరి మోగించింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చాన్ యంగ్ జాన్ జతగా హింగిస్ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రెండోసీడ్ హింగిస్-చాన్ జోడీ 6-3, 6-2తో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన ఏడోసీడ్ జంట లూసీ రదెకా-కాటరీనా సినియకోవాపై విజయం సాధించింది. 36ఏండ్ల హింగిస్‌కిది కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. సింగిల్స్ ఐదు గ్రాండ్‌స్లామ్స్ సాధించిన హింగిస్.. 7 మిక్స్‌డ్ డబుల్స్, 13 మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అందుకుంది.