తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 227 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 227 ఆలౌట్

  అడిలైడ్: యాషెస్ రెండో టెస్టులో ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. స్పిన్నర్ లియాన్ (4/60), పేసర్ స్టార్క్ (3/49) బౌలింగ్‌లో చెలరేగడంతో.. 29/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు సోమవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 76.1 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 221 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్టన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్. వోక్స్ (36), అలీ (21) మినహా అందరూ విఫలమయ్యారు. తర్వాత ఆట ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 4 వికెట్లకు 53 పరుగులు చేసింది. హాండ్స్‌కోంబ్ (3 బ్యాటింగ్), లియోన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే అండర్సన్..ఓపెనర్ ను బాన్‌క్రాఫ్ట్‌ను పెవిలియన్ పంపడంతో ఆసీస్ 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఖవాజా (20), వార్నర్ (14), స్మిత్ (6) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.