తొలి టెస్ట్ నేటినుంచి :ఇండియాVsవెస్ట్ఇండీస్

తొలి టెస్ట్ నేటినుంచి :ఇండియాVsవెస్ట్ఇండీస్

తొలి టెస్ట్ నేటినుంచి :ఇండియాVsవెస్ట్ఇండీస్

అంటిగ్వా: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్ట్ కోసం టీమ్‌ఇండియా మెండైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. దీనికి తోడు తాను చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగబోతున్న తొలి సిరీస్ కావడంతో అనిల్ కుంబ్లే.. ఈ సిరీస్‌పై సిరీయస్‌గా దృష్టి సారించాడు. ఇప్పటికే వినూత్న పద్ధతుల ద్వారా ఆటగాళ్లతో మమేకమైన కుంబ్లే..కోచ్‌గా ఏ మేరకు జట్టును తన వ్యుహాలతో ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొంతగడ్డపై విండీస్ అంతగా అనుభవం లేని జట్టుతో టీమ్‌ఇండియాను ఎదుర్కొబోతున్నది. ప్రధాన సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాతో రెండు మ్యాచ్‌లను విండీస్ ద్వితీయ శ్రేణి జట్టు డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు వేదికైన అంటిగ్వా వికెట్‌పై పచ్చిక దర్శనమివ్వనున్న క్రమంలో జట్ల కూర్పుపై ఒకింత ఆసక్తి నెలకొంది.