యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లోకి నాద‌ల్‌

 యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లోకి నాద‌ల్‌

 న్యూయార్క్: టాప్ సీడ్ రాఫెల్ నాద‌ల్ యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో ప్ర‌వేశించాడు. సెమీస్‌లో మార్టిన్ డెల్ పోట్రోపై 4-6, 6-0, 6-3, 6-2 స్కోర్‌తో నాద‌ల్ విజ‌యం సాధించాడు. సౌతాఫ్రికాకు చెందిన కెవిన్ అండ‌ర్స‌న్‌తో నాద‌ల్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్నాడు. నాద‌ల్ ఓ ద‌శ‌లో వ‌రుస‌గా తొమ్మిది గేమ్‌లు గెలిచాడు. 31 ఏళ్ల నాద‌ల్‌కు యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో ఆడ‌డం ఇది మూడ‌వ సారి. ఇప్ప‌టి వ‌ర‌కు నాద‌ల్ ఖాతాలో 16 గ్రాండ్‌స్లామ్స్ ఉన్నాయి. మొద‌టి సెమీఫైన‌ల్లో అండ‌ర్స‌న్ 4-6, 7-5, 6-3, 6-4 స్కోర్‌తో స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టాపై గెలుపొందాడు. ప్ర‌స్తుతం అండ‌ర్స‌న్ ర్యాంక్ 32. అయితే ర్యాంకింగ్ ప‌ద్ధ‌తి ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరిన లోయెస్ట్ ర్యాంక్ ప్లేయ‌ర్‌గా అండ‌ర్స‌న్ నిలిచాడు.