వార్నర్ స్థానంలో విలియమ్సన్

వార్నర్ స్థానంలో విలియమ్సన్

  న్యూఢిల్లీ: హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేశారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఐపీఎల్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ స్థానంలో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టుకు నాయకత్వం వహించేందుకు నేను అంగీకరించా. నైపుణ్యం ఉన్న కుర్రాళ్లను నడిపించేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని విలియమ్సన్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కే షణ్ముగం తెలిపారు. కెప్టెన్సీ రేసులో శిఖర్ ధవన్, పెరీరా పేర్లు ఉన్నా.. చివరకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం విలియమ్సన్ వైపు మొగ్గు చూపింది.