జింబాబ్వే ఐదేళ్ళ తర్వాత  విజయం...

జింబాబ్వే ఐదేళ్ళ తర్వాత  విజయం...

  సిల్హత్‌: జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌పై మంగళవారం చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాను జింబాబ్వే 151 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పర్యాటక జింబాబ్వే జట్టు ఐదేళ్ళ తర్వాత విదేశాల్లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 169 పరుగులకే కుప్పకూలింది. ఇది జింబాబ్వే టెస్టు చరిత్రలో మూడో విదేశీ టెస్టు విజయం కాగా... 17 ఏళ్ల తర్వాత స్వదేశం వెలుపల తొలి గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇమ్రుల్‌ కైస్‌(43), అరిఫుల్‌ హక్‌(38), లిటన్‌ దాస్‌(23)లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించగా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్‌ మావుతా నాలుగు, సికందర్‌ రాజా మూడు వికెట్లు సాధించారు. 

- జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ 282 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 181 ఆలౌట్‌
- బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 143 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 169 ఆలౌట్‌