16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

  ఓ 16 ఏళ్ల బాలికపై 11 మంది యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. నగరంలోని కామాటిపురాౌ గొల్లాకిడికి చెందిన బాలికపై కొందరు యువకులు గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నారు. ఆ బాలిక ఇంట్లో భయపడి ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఆ కామాందులు అత్యాచారం చేస్తూ.. వీడియో తీశారు. ఈ వీడియోలను ఫేస్ బుక్, వాట్సాప్ లలో షేర్ చేస్తామని బేదిరించే వారు. ఇటీవల తల్లిదండ్రులు విషయం తెలుసుకుని కామాటీపురా పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. గత 4 ఏళ్లగా అత్యాచారం చేసినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, బస్తీ వాసులు కామాటిపురా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.