ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

కరీంనగర్ పంచాయతీ రాజ్  ఏఈ జగదీశ్ బాబును రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏఈ జగదీశ్ బాబు కరీంనగర్ లో  ఓ సీసీ  రోడ్డుకు  సంబంధించి  మెజర్ మెంట్ బుక్ ఇచ్చేందుకు గంగారెడ్డి అనే  కాంట్రాక్టర్ ను  లంచం అడిగాడు.  దీంతో బాధితుడు  ఏసీబీని  ఆశ్రయించాడు. ఎంపిడివో ఆఫీసులోని టాయ్ లెట్ లో లక్షన్నర రూపాయలు  తీసుకుంటుండగా ఏఈని  పట్టుకున్నరు అధికారులు.

రెండేళ్ల కింద ఎమ్మెల్యే  ఫండ్స్ తో  పూర్తి చేసిన  సీసీ రోడ్డు ఎంబి  రికార్డు ఇవ్వకుండా ఏఈ  జగదీశ్ బాబు  కాంట్రాక్టర్ ను  ముప్పతిప్పలు  పెడుతున్నాడు.  బుక్  సబ్ మిట్  చేస్తేకానీ  బిల్లు మంజూరు  కాదని  బతిమిలాడినా డబ్బులిస్తేనే రికార్డు ఇస్తానని వేధించాడని  చెప్తున్నాడు  బాధితుడు.  గతంలో మరోపనికి 3 లక్షలు లంచం ఇచ్చిన కాంట్రాక్టర్ ఈసారి డబ్బులడగడంతో ఏసీబీ అధికారులను  ఆశ్రయించాడు. ఏఈని అరెస్టు చేసిన ఏసీబి అధికారులు విచారణ కొనసాగుతుందని  చెప్పారు.