ఆడపడుచుల వేధింపులతో..

ఆడపడుచుల వేధింపులతో..

 బహదూర్‌పురా: ఆడ పడుచుల వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పహడీషరీఫ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూనుస్‌ కుమార్తె సబా బేగంకు నాలుగేళ్ల క్రితం మహ్మద్‌ షకీల్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్ల కిత్రం ఉద్యోగం నిమిత్తం షకీల్‌ దుబాయ్‌ వెళ్లాడు. వీరికి ఒక పాప.

ఇదిలా ఉండగా షకీల్‌ సోదరిలు నసీం బేగం, మాలన్‌ బేగం, గోరి బేగం సబా బేగంను తరచూ డబ్బులు తీసుకురావాలని, తమ సోదరుడికి విడాకులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారు. మంగళవారం రాత్రి భర్తకు ఫోన్‌ చేసిన మాట్లాడిన సబా బేగం అనంతరం ఇంట్లోని సీలింగ్‌ రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో మహ్మద్‌ యూనుస్‌ కూతురికి ఫోన్‌ చేయగా ఫోన్‌ మాట్లాడిన  నసీం బేగం మీ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది శాలిబండలోని ఆస్రా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వారు ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే సబా బేగం మృతి చెంది ఉంది. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.