అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

గుజరాత్: అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో ప్రయాణికులంతా అక్కడి నుంచి దూరంగా వెళ్లారని అధికారి ఒకరు తెలిపారు.

సమాచారమందుకున్న బాంబు స్క్వాడ్ బృందం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని తనిఖీలను కొనసాగిస్తున్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.