అతివేగం తో ప్రాణాలు కొలిపోయారు

అతివేగం తో ప్రాణాలు కొలిపోయారు

మేడ్చల్: మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వస్తున్న ఒక్క కార్ డివైడర్ ను ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి కక్కడే చనిపోగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న దుండిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సూరారంలోని మల్లారెడ్డి  ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత వారిని ఉస్మానియా ఆస్పత్రికి తీస్కెళ్లారు.

ప్రమాదానికి గురైనవరంత హైదరాబాద్ నగరం లోని చార్మినార్ ఏరియాల్లో చిన్న,చిన్న వ్యాపారాలుచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీరంతా నవంబర్-9వ తేదిన తెల్లవారు జామున ఒక్క కారు(TS D3 EG 1431) లో కర్ణాటకకు సరదాగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు.అక్కడ నుంచి తిరుగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. నిన్నఅర్థరాత్రి పటాన్ చెరులో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాల్సి ఉండగా దారి తప్పి మేడ్చల్ దగ్గర ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తున్నారు.

ఔటర్రింగ్ రోడ్ పై లిమిట్ కు మించిన స్పీడ్ తో వెళ్తుండగా గండిమైసమ్మ-దుండిగల్ మండలం శంభీపూర్ అండర్ పాస్ బ్రిడ్జి దగ్గర కారు అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టి పల్టీలుకొట్టింది. ఈ ప్రమాదంలో  డ్రైవ్ చేస్తున్న సయ్యద్ సలీం, ముందు సీట్లో కూర్చున్న అన్సారీ..వెనుక సీట్లో కూర్చున్న అక్రమ్,వకార్,ముజుబుద్దీన్ అంతా కారులోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇందులో సయ్యద్ సలీం, అన్సారీ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.