బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు

బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు

 జమ్మూకశ్మీర్: కిడ్నాప్‌నకు గురైన 15 ఏళ్ల బాలికను జమ్మూకశ్మీర్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా కాపాడారు. భెర్త్ కుండేర్ధన్ గ్రామంలోని చసానా ప్రాంతంలో పెండ్లి కార్యక్రమంలో తన కూతురు అదృశ్యమయిందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాలిక కోసం ఆపరేషన్ ప్రారంభించారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న అధికారులు..అతడి చెర నుంచి బాలికకు విముక్తి కల్పించారు. బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడికి సహకరించిన వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.