>

బాలికతో బర్రె పెండ తినిపించారు..

బాలికతో బర్రె పెండ తినిపించారు..

 లాతూర్‌: తాంత్రిక పూజల్లో భాగంగా బాలికతో బర్రె పెండ తినిపించిన సంఘటన కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో చోటుచేసుకున్న ఈ దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.లాతూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబీకులు వైద్యుడికి చూపించాల్సిందిపోయి.. మంత్రగాళ్లను ఆశ్రయించారు. బాలికకు దెయ్యం పట్టిందని నిర్ధారించిన భూతవైద్యులు.. చికిత్సలో భాగంగా ఆమెచేత బలవంతంగా బర్రె పెండ తినిపించారు.గతవారం జరిగిన ఈ ఉదంతం మీడియా ద్వారా బహిర్గతం కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదుచేసుకుని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.


Loading...