బస్సులో అమ్మాయి పక్కన కూర్చొని లైంగిక వేధింపులు

 బస్సులో అమ్మాయి పక్కన కూర్చొని లైంగిక వేధింపులు

  న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మర్మాంగాన్ని చూపిస్తూ, తనను అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని(20) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వేధింపులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి7న ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ ఫైనలియర్ విద్యార్థిని సాయంత్రం ఇంటికి వెళ్తోంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో యువతి పక్క సీట్లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. యువతిని చూస్తూ అసభ్య సంకేతాలివ్వడంతో ఆమె కాస్త పక్కకు జరిగి కూర్చుంది. అయితే ఆ వ్యక్తి విద్యార్థినిని అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బస్సులోకి తోటి ప్రయాణికులు గమనించినా బాధితురాలికి సాయం చేయకపోవడంతో వేధింపులపై ఫిర్యాదు చేయాలని ఆ తతంగాన్ని వీడియో తీసింది

ఆపై వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వేధింపుల ఘటనపై ఫిర్యాదు చేసి నిందితుడిని శిక్షించాలని కోరింది. గంట వ్యవధిలోనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్లు మోనికా భరద్వాజ్ అడిషనల్ డీజీపీ (సౌత్-వెస్ట్) తెలిపారు. నిందితుడు ఓ బ్యాగు అడ్డుగా పెట్టుకుని కేవలం బాధితురాలికి తన మర్మాంగాన్ని చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫొటో మేరకు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.