భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు

భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు

  జయపురం: ఓ ఆదివాసీ వివాహిత బాయ్‌ఫ్రెండ్‌ ఆమె అశ్లీల చిత్రాలను భర్తకు పంపిన సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఆమె వివాహం జరిగిన పది రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడంతో  ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి.  జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక గ్రామానికి చెదిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన ఓ యువతికి గడిచిన ఏప్రిల్‌ 20వ తేదీన వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితం ఆరంభించకుండానే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ యువకుడు అశ్లీలంగా ఉన్న వధువు ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పోస్ట్‌చేశాడు. 

ఆ ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అని తెలుస్తోంది. తన వాట్సాప్‌కు వస్తున్న అశ్లీల ఫొటోలను చూసిన వరుడు జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తాను భార్యతో ఉండలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌కు పోస్టు చేసిన వ్యక్తి గురువారం అస్కాలో పట్టుబడినట్లు తెలిసింది.