భార్య,కూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన భర్త అరెస్ట్

భార్య,కూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన భర్త అరెస్ట్

  కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మదినిపూర్ జిల్లాలో తాల్లా గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్యపై దినేశ్ మన్నా(28) అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో దినేశ్ భార్యతో పాటు, అతడి కూతుర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిచారు. దినేశ్‌కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు అతడిని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.