భార్య మరణం,భర్త రెండో పెళ్లి : కూతురు ఆత్మా హత్యా.

భార్య మరణం,భర్త రెండో పెళ్లి : కూతురు ఆత్మా హత్యా.

భార్య మరణం,భర్త రెండో పెళ్లి : కూతురు ఆత్మా హత్యా.

హైదరాబాద్: కన్నతల్లి చనిపోవడంతో ఏడాది కాలంగా మనస్తాపంతో బాధపడుతున్న పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ అంబర్ పేట మల్లిఖార్జుననగర్ లో నివాసముంటూ పాల వ్యాపారం చేస్తున్న రమేష్ రెడ్డి, మనోర దంపతుల కూతురు దీపిక(15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా, దీపిక తల్లి మనోర గత 2015, జనవరిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తమ తల్లి తమను వదిలేసి వెళ్లిందనే మనస్తాపంతో దీపిక ఎంతో ఆవేదనకు గురైంది. అయితే, తండ్రి రమేష్ రెడ్డి గత నాలుగు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. తన చిన్నమ్మ కూడా బాగా చూసుకున్నప్పటికీ దీపిక మాత్రం తల్లి మరణాన్ని మరిచిపోలేకపోయింది. మంగళవారం రాత్రి 9గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.