బిల్డింగ్‌ పైనుంచి దూకి.. సినీ రైటర్‌ ఆత్మహత్య

బిల్డింగ్‌ పైనుంచి దూకి.. సినీ రైటర్‌ ఆత్మహత్య

  ముంబై : బాలీవుడ్‌ సినీ రచయిత రవి శంకర్‌ అలోక్‌ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ అందేరీలో నివాసం ఉంటున్న అలోక్‌ బుధవారం మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో తను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అలోక్‌ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టమన్నారు. కాగా నానా పటేకర్‌ నటించిన అబ్‌ తక్‌ చప్పాన్‌ చిత్రాని రవి స్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడని సమాచారం.