చిన్నారి నోట్లో బాంబు పేల్చి..

చిన్నారి నోట్లో బాంబు పేల్చి..

  లక్నో : దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా యూపీలో దారుణం చోటుచేసుకుంది. మిలాక్‌కు చెందిన ఓ యువకుడు తన రాక్షసానందం కోసం మూడేళ్ల చిన్నారి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. వివరాలు... మిలాక్‌కు చెందిన చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న హర్పాల్‌ అనే యువకుడు ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు.ఈ క్రమంలో తన దగ్గర ఉన్న సుతిల్‌ బాంబు చిన్నారి నోట్లో పెట్టి అంటించాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.