>

చిత్తూరు జిల్లాలో  రెచ్చిపోయిన ఉన్మాది!

చిత్తూరు జిల్లాలో  రెచ్చిపోయిన ఉన్మాది!

 చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి కె.యం.యం కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక కళాశాలలో ఎంబీఏ చదువుతున్న కీర్తన తనును పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఇప్పుడు మోసం చేస్తోందంటూ ధనుష్‌ అనే యువకుడు దాడికి తెగబడ్డాడు.


ఆమెను కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలు పాలైన కీర్తనను తోటి విద్యార్థులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. కీర్తనకు నాలుగు కత్తిపోట్లు దిగినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని స్నేహితులు దాడి చేసి పారిపోతున్న ధనుష్‌ను వెంబడించి చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.


Loading...