ఇద్దరు మహిళలను కొట్టి చంపిన దుండగులు

ఇద్దరు మహిళలను కొట్టి చంపిన దుండగులు

  హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌజ్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను దుండగులు కర్రలతో కొట్టి చంపారు. మహిళలను చంపిన దుండగులు మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి మహిళల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసి సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.