ఇల్లు అద్దెకు ఇప్పిస్తానంటూ మహిళపై...

ఇల్లు అద్దెకు ఇప్పిస్తానంటూ మహిళపై...

 రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మైలార్‌దేవ్‌పల్లిలో ఇల్లు అద్దెకు ఇప్పిస్తానంటూ ఓ మహిళపై మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అత్యాచారం చేశాడు. అద్దెకు ఇల్లు కావాలంటూ వెతుకుతున్న మహిళను ట్రాప్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి... నేను మంచి ఇళ్ల‌ను వెతికి పెడుతానంటూ నమ్మబలికి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు... ఆ తర్వాత సాయంత్రం ఫోన్ చేసి మైలార్ దేవిపల్లికి రావాలని పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తన‌పై అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.