హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో దారుణం

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో దారుణం

  హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో నిన్న రాత్రి(బుధవారం) దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలు, ఆమె స్నేహితురాలిపై యాసిడ్‌ దాడి చేశాడు. యాసిడ్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. వివరాలు..హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన శంకర్‌, ఝాన్సీలు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఝాన్సీ నగరంలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తోంది.  కొద్ది రోజుల క్రితం ఝాన్సీకి అదే పెట్రోలు పంపులో పనిచేస్తున్న రమ్య పరిచయమైంది. అప్పటి నుంచి ఝాన్సీ తనను పట్టించుకోవడం లేదని, తన గురించి రమ్య చెడుగా చెప్పిందని భావించి ఇద్దరిపై కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై బాత్రూంలో వాడే యాసిడ్‌తో దాడి చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.