>

ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

 హైదరాబాద్‌ : మియాపూర్‌ మదీనాగూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం దుండగులు విద్యార్థిని మృతదేహాన్ని కొండల్లో పడేశారు. అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌గా గుర్తించారు. చాందిని జైన్‌ ఈ నెల 9న కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. సైబరాబాద్‌ జాయింట్ పోలీసు కమిషనర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.