కాచిగూడలో యువతి అదృశ్యం

కాచిగూడలో యువతి అదృశ్యం

  కాచిగూడ : దారం కోసం వెళ్లిన యువతి అదృశ్యమైంది. కాచిగూడ ఎస్సై మధు కథనం ప్రకారం..కాచిగూడ డివిజన్, నిం బోలిఅడ్డా ప్రాంతానికి చెందిన సన్నీ కుమార్ కూతురు నిషా సన్నీకుమార్(20) ఇంటర్ చదివింది. కాగా... ఈ నెల 5న నిషా దారం తీసుకువస్తాన ని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువుల ఇండ్లల్లో వాకబ్ చేసినా ఆచూకీ లభించలేదు. మంగళవారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.