కత్తులతో స్టూడెంట్స్ హల్ చల్

కత్తులతో స్టూడెంట్స్ హల్ చల్

చెన్నై: చెన్నై లోకల్ ట్రైన్‌లో కొంతమంది విద్యార్థులు కత్తులతో హల్‌చల్ సృష్టించారు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేతుల్లో కత్తులు కలకలం రేపుతున్నాయి. నలుగురు విద్యార్థులు లోకల్ ట్రైన్‌లో రెండు పదునైన కత్తులతో ఆటలాడుతూ కనిపించారు.

 లోకల్ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు పోలీసులకి సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద ఉన్న రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

విద్యార్థుల వద్ద కత్తులు ఎందుకు ఉన్నాయి. విద్యార్థులు ట్రైన్ లో కత్తులతో ఎందుకు వెళ్తున్నారనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.