లైవ్‌లో ఆత్మహత్యాయత్నం....కాపాడిన పోలీసులు

లైవ్‌లో ఆత్మహత్యాయత్నం....కాపాడిన పోలీసులు

 మహారాష్ట్రలోని లాతూరు జిల్లాకు చెందిన ఓ మహిళ (30) ఆత్మహత్యాయత్నాన్ని సోషల్ మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్ చేయడంతో పోలీసులు పరుగెత్తుకువెళ్లి ఆమెను కాపాడారు. సామాజిక కార్యకర్త అయిన ఆ మహిళ లాతూరకు హౌసా రోడ్డులోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. కొన్నాళ్లక్రితం వరకు ఆమె సామాజిక సంస్థ పాంథర్ సేనలో పనిచేసేవారు. సంస్థ నుంచి ఆమె రాజీనామా చేసిన తర్వాత కొందరు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులతో విసిగిపోయిన ఆమె ఆత్మహత్యసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఫేస్‌బుక్‌లో రియల్‌టైమ్ లైవ్‌స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. తాను ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించి దోమలమందు తాగారు. ఆ లైవ్‌ను చూసిన కొందరు పోలీసులను అప్రమత్తం చేశారు. వారు హుటాహుటిన ఆమెను దవాఖానలో చేర్చి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె ప్రమాదం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.