మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో పోలీసుల నిర్భంధ తనిఖీలు

మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో పోలీసుల నిర్భంధ తనిఖీలు

  సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పర్వత నగర్‌లో డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైల తో కలిపి సుమారు 200 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ ప్లాటూన్ బలగాలు.. పది బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. సుమారు 556 ఇండ్లలో 1520 మందిని తనిఖీలు చేసి 28 మంది అనుమానితులను, ఇద్దరు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవ పత్రాలు లేని 35 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలలో భద్రతా భావం కల్పించేందుకే నిర్భంధ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపారు.