మద్యం మత్తులో యువతి వీరంగం

మద్యం మత్తులో యువతి వీరంగం

 హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 151 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్‌లో జరిగిన తనిఖీల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. తనిఖీలు షూట్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడికి పాల్పడింది. పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించింది. మహిళా కానిస్టేబుల్ సహాయంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 103 బైక్‌లు, 46 కార్లు, 2 ఆటోలను సీజ్ చేశారు.