మద్యం సేవించాడు...చేయ్యిచేస్కున్నాడు.. ఇంకా వంట చెయ్యలేదా.. అంతే కుమారుడిని చంపేసిన కన్నా తండ్రి!

మద్యం సేవించాడు...చేయ్యిచేస్కున్నాడు.. ఇంకా వంట చెయ్యలేదా.. అంతే కుమారుడిని చంపేసిన కన్నా తండ్రి!

మద్యం సేవించాడు...చేయ్యిచేస్కున్నాడు.. ఇంకా వంట చెయ్యలేదా.. అంతే కుమారుడిని చంపేసిన కన్నా తండ్రి!

మందేసి రావడంతో పాటు వంట చేయలేదని తండ్రే కొడుకును హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లబుద్ధారంకు చెందిన బొడ్డు సమ్మయ్యకు కుమారుడు దేవేందర్‌ (22), కుమార్తె స్వరూప ఉన్నారు. కుమార్తెకు వెంకటాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించడంతో కుమారుడితో కలిసి సమ్మయ్య గొల్లబుద్ధారంలో నివసిస్తున్నాడు.
అయితే మంగళవారం పనికంటూ వెళ్లొచ్చిన సమ్మయ్య కుమారుడిని వంట చేయమన్నాడు. కానీ అప్పటికే మందేసి వచ్చిన కుమారుడు తండ్రి చెప్పిన పనిని చేయకపోవడంతో పాటు అతనిపైన చేజేసుకున్నాడని.. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి.. కుమారుడు నిద్రించాక రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో దేవేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఘటనకు పాల్పడిన తండ్రి సమ్మయ్య పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.