మ‌హిళ‌ను కాలితో త‌న్నిన కార్పొరేట‌ర్‌

మ‌హిళ‌ను కాలితో త‌న్నిన కార్పొరేట‌ర్‌

  చెన్నై: ప్రజల మంచి చెడులు చూడాల్సిన ఓ రాజకీయనాయకుడు, మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడికి దిగాడు. తమిళనాడులోని పెరంబలూర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీఎంకే కార్పొరేటర్‌ సెల్వకుమార్‌కు బ్యూటీపార్లర్‌ యజమాని సత్యకు మధ్య మే25న  తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సెల్వకుమార్‌ ఆమెను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న మహిళలు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా కిందపడేసి కాలుతో ఇష్టానుసారంగా తన్నాడు. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.