మళ్లీ పోలీసుల వద్దకు ఉపేంద్ర బాధితురాలు

మళ్లీ పోలీసుల వద్దకు ఉపేంద్ర బాధితురాలు

  హైదరాబాద్‌: మయూర్‌ పాన్‌ షాప్‌ యజమాని ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయానంటూ ఫిర్యాదు చేసిన బాధితురాలు బుధవారం మరోమారు పోలీసులను ఆశ్రయించారు. తనపై ఉపేంద్ర వర్మ సోదరుడు చేస్తోన్న ఆరోపణల్లో నిజంలేదని, ఆ కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఏసీపీ షికా గోయల్‌కు మొరపెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినందుకే ఉపేంద్రను నమ్మానని చెప్పారు.

‘‘ఉపేంద్ర సోదరుడు ఆరోపిస్తున్నట్లు నేనేమీ ప్రీతి(ఉపేంద్ర భార్య)తో గొడవపడలేదు. బ్లాక్‌ మెయిల్‌ అంతకన్నా చేయలేదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే న్యాయం కోసం ఆ ఇంటికి వెళ్లాను. ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీసి నన్ను బద్నామ్‌ చేస్తున్నారు. నా కాలేజ్‌ ఫ్రెండ్‌ ఒకరితో చనువుగా ఉండేదాన్ని. కానీ మనస్పర్థలు రావడంతో మేం విడిపోయాం. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన ఉపేంద్రపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని బాధితురాలు చెప్పారు.