మంత్రి తలసాని కారును ఢీకొన్న లారీ

మంత్రి తలసాని కారును ఢీకొన్న లారీ

మేడ్చల్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.ఈ రోజు ఉదయం  (బుధవారం) మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం అంతయిపల్లి గ్రామంలో కొత్త కలెక్టరేట్ భవన శంకుస్థాపన చేశారు.

అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా... ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర దగ్గర మంత్రి కారును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వెనక భాగం దెబ్బతిన్నది. మంత్రితోపాటు ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్లాస్టిక్ సరుకుతో వేగంగా వస్తున్న లారీ...మంత్రి తలసాని కాన్వాయ్ లోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తం అయిన డ్రైవర్ వెంటనే కారును పక్కకు తీశారు. ఈలోపే లారీ కారు వెనక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.