మైనర్‌ బాలికలతో చీకటి దందా

మైనర్‌ బాలికలతో చీకటి దందా

 పట్నా : బిహార్‌లోని కతిహార్‌లో పోలీసులు ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. దాడుల్లో ముగ్గురు మైనర్‌ బాలికలు సహా 32 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కతిమార్‌లోని గులాబ్‌ బాగ్‌ ప్రాంతంలో గుట్టుచప్పుటు కాకుండా నడిపిస్తున్న చీకటి దందాను పూర్నియా పోలీసులు రట్టు చేశారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమచారం అందడంతో పోలీసులు బృందంగా ఏర్పడి మెరుపు దాడులు చేపట్టారు.కాగా వ్యభిచార దందాలో ప్రముఖుల పాత్ర ఉన్నట్టు తెలిసింది. వ్యాపారులు సైతం తరచూ ఇక్కడికి వస్తుంటారని స్ధానికులు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. వీరిని త్వరలోనే కోర్టు ముందు హాజరు పరిచి తదుపరి చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.