ముంబ‌యి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

ముంబ‌యి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

  ముంబయి : ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్‌పోర్టులో రూ.1.86 కోట్ల విలువైన 6.45 కిలో గ్రాముల బంగారాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి దుబాయ్ వెళుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇండియా పాస్‌పోర్టు కలిగిన ఈ నలుగురు వ్యక్తులు జెట్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి దుబాయ్‌కి వెళుతున్నారు. ఈ క్రమంలో ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం మారే సమయంలో వీరిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు అక్రమంగా బంగారాన్ని తీసుకెళుతున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.