నటి డిస్కోశాంతి మేనకోడలు అదృశ్యం

నటి డిస్కోశాంతి మేనకోడలు అదృశ్యం

 పెరంబూరు: డిస్కోశాంతి మేనకోడలు గత ఐదు రోజుల క్రితం అదృశ్యం అయ్యింది. చెన్నై త్యాగరాయనగర్‌లో నివశిస్తున్న అరుణ్‌ మోళి వర్మన్, సెరిల్‌ దంపతుల పెద్దకూతురు అబ్రిన(17) స్థానిక అన్నాశాలైలోని చర్చ్‌పార్క్‌ పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతోంది. కాగా అబ్రిన్‌ గత 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక టీ.నగర్, పాండిబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదుచేశారు.


అయితే ఇవాల్టికి ఐదు రోజులు అయానా అబ్రిన్‌ ఆచూకీ తెలియక పోవడంతో నటి డిస్కోశాంతి సోదరి లలితకుమారి, ఆమె సొదరుడి కుటుంబం సోమవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలీస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదనీ పేర్కొన్నారు. అబ్రిన చదువుతున్న పాఠశాలలో 56 సీసీ కెమెరాలు ఉన్నా తమకు సంబంధించిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదన్నారు.  అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయంలో ఉదాసీనతగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. మీడియా ద్వారా తమ అబ్రినను పొందగలమనే నమ్మకంతో ఉన్నామని లలితాకుమారి కన్నీరు మున్నీరవుతూ పేర్కొన్నారు.