పాపకు పాలుపట్టలేక గొంతు కోసింది..

పాపకు పాలుపట్టలేక గొంతు కోసింది..

  భోపాల్ : పదేపదే పాలు కావాలని ఏడుస్తోన్న పసిబిడ్డను ఓ తల్లి కిరాతకంగా చంపేసింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఏడాది వయసున్న చిన్నారి.. తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఇప్పుడే కదా పాలిచ్చింది.. మళ్లీ మళ్లీ పాలు అడుగుతావా? అంటూ ఆ తల్లి ఆగ్రహానికి లోనైంది. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తల్లి.. తన ఏడాది పాపను గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.